తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయి. రావులపాలెం మండలం ఊబలంక వద్ద 75 మందికి పరీక్షలు చేయగా 16 మందికి, గోపాలపురంలో 18 మందికి, కొత్తపేట మండలం వానపల్లిలో 75 మంది పరీక్షలు చేయగా 27 మందికి పాజిటివ్ రాగా మొత్తం 61 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు దుర్గాప్రసాద్, రవికుమార్‌లు తెలిపారు.
కొత్తపేటలో కరోనా విజృంభణ.. కొత్తగా 61కేసులు - కరోనా తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఒక్కరోజే 61పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరిలో కరోనా విజృంభణ.. కత్తగా 61కేసులు నమోదు