రాజమహేంద్రవరంలో పటిష్టంగా లాక్డౌన్ - కరోనా ఎఫెక్ట్ ఇన్ రాజమహేంద్రవరం
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ చేపట్టారు. రాజమహేంద్రవరంలో పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పహారా కాస్తూ బయటకు వచ్చే వారిపై నిఘా పెడుతున్నారు.
రాజమహేంద్రవరంలో పటిష్టంగా లాక్ డౌన్
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను రాజమహేంద్రవరం పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి మాత్రం మినహాయింపునిస్తున్నారు. నగర వీధుల్లో వివిధ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న దుకాణాలను పోలీసులు మూయించి వేశారు. స్వయంగా అర్బన్ ఎస్పీ షిముషి బాజ్ పాయ్ బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.