గత ప్రభుత్వ హయాంలో మరణించిన రైతుల పేర్ల మీద సహకార రుణాలు తీసుకుని రూ. 11 కోట్లు స్వాహా చేశారని.. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. తెదేపా నేత యనమల రామకృష్ణుడు, తెదేపా నేతల పాత్ర ఉందని ప్రభుత్వ విప్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొండంగి మండలానికి చెందిన 61 మంది పేర్ల మీద.. నకిలి పాస్ పుస్తకాలు, సంతకాలతో గండేపల్లి సొసైటీలో సుమారు రూ. 11 కోట్లు స్వాహా చేశారన్నారు.
'గత ప్రభుత్వ హయాంలో సహకార రుణాల్లో అవకతవకలు.. రూ.11కోట్లు స్వాహా'
గత ప్రభుత్వ తెదేపా హయంలో మరణించిన రైతుల పేర్ల మీద సహకార రుణాలు తీసుకుని రూ. 11 కోట్లు స్వాహా చేశారని.. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు.
గత ప్రభుత్వ హయంలో మరణించిన రైతుల పేర్ల మీద సహకార రుణాలు
2014లో మరణించిన 9 మంది రైతుల పేర్ల మీద..2016-2017 రుణాలు తీసుకున్నారంటే దీని వెనక ఎంత పెద్ద స్థాయి వారు ఉన్నారో అర్థం అవుతుందన్నారు. దీనిపై యనమల ఏం సమాధానం చెబుతారో చూడాలన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం