ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండ ముప్పు నుంచి.. ఇదో చల్లటి ఉపశమనం!! - చల్లటి గాలి వీచే శిరస్త్రాణం తయారీ తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ పాలిటెక్నిక్‌ విద్యార్థి.. చల్లని గాలినిచ్చే శిరస్త్రాణాన్ని రూపొందించాడు. శిరస్త్రాణం తలపై ధరించాక లోపల చెమట పట్టకుండా గాలి వీచేందుకు బ్లోయర్‌ ఏర్పాటు చేశాడు.

helmet
చల్లటి గాలి వీచే శిరస్త్రాణం

By

Published : Apr 12, 2021, 10:27 AM IST

Updated : Apr 12, 2021, 1:05 PM IST

చల్లటి గాలి వీచే శిరస్త్రాణం

చల్లటి గాలి వీచే శిరస్త్రాణాన్ని రూపొందించాడు తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థి తిరుమలనేడి సాయి. శిరస్త్రాణానికి ముందు చిన్న ఫ్యాన్‌, తలపై ధరించాక లోపల చెమట పట్టకుండా గాలి వీచేందుకు బ్లోయర్‌ ఏర్పాటు చేశాడు. రెండు వైపులా సోలార్‌ ప్యానెళ్లతో బ్యాటరీ ఛార్జింగ్‌ అవుతుంది.

ఈ శిరస్త్రాణ తయారీ కోసం హెల్మెట్‌, 12 వాట్‌ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్‌ ప్యానెళ్లు, కంప్యూటర్‌ సీపీయూ ఫ్యాన్‌, రెండు 9 వాట్‌ల రీఛార్జిబుల్‌ బ్యాటరీలు వినియోగించినట్లు సాయి వివరించాడు. పనివేళల్లో పలు రంగాల కార్మికులు ఎండ వేడితో పడే ఇబ్బందులకు ఇది పరిష్కారంగా పని చేస్తుందన్నాడు.

Last Updated : Apr 12, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details