ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నట్టేట.. గ్యాస్ కష్టాలు - తూర్పు గోదావరిలో వరదలు

తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు ఇళ్లను చుట్టు ముట్టడంతో ఇంటిని ముంచెత్తడంతో.. డాబాలపై వంటే చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వంట గ్యాస్ అయిపోయిన వారి ప్రరిస్థితి దారుణంగా మారింది. వంట గ్యాస్ సిలిండర్లు తెచ్చుకోవడానికి నీట మూనిగి వెళ్లాల్సి వస్తోంది.

cooking gas difficulties at  east godavari
నట్టేట.. గ్యాస్ కష్టాలు

By

Published : Aug 20, 2020, 12:28 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మన్యం సహా కోనసీమ లంక గ్రామాల్లో స్వల్పంగా వరద తగ్గింది. దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజనులు కొండల్లో తలదాచుకుని అవస్థలు పడుతున్నారు. వరదలకు జిల్లాలోని 168 గ్రామాలు ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో డాబాల పైనే వంటలు చేసుకుంటున్నారు. వివిధ గ్యాస్ ఏజెన్సీలు వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఖాళీ సిలిండర్లను రహదారుల వద్దకు తీసుకురావడం వరద బాధితులకు కష్టంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details