ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ జేఎన్టీయూలో ఒప్పంద అధ్యాపకుల ఆందోళన - protest

నాలుగు నెలలుగా ప్రతి రోజూ కళాశాలకు వస్తున్నప్పటికీ తనకు జీతం ఇవ్వడం లేదని కాకినాడ జేఎన్టీయూలో ఓ ఒప్పంద అధ్యాపకుడు ఆందోళన చేశారు. పాత విషయాలను మనసులో పెట్టుకుని కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఆందోళన

By

Published : Aug 24, 2019, 11:32 PM IST

వీసీ ఛాంబర్​లో ఒప్పంద అధ్యాపకుల ఆందోళన

న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేఎన్టీయూ ఒప్పంద అధ్యాపకుడు ఆందోళన నిర్వహించారు. ఉప కులపతి రామలింగరాజు ఛాంబర్​లో సహ అధ్యాపకులతో కలసి బైఠాయించారు. ఒప్పంద అధ్యాపకులను తొలగించకూడదనే కోర్టు ఆదేశమున్నప్పటికీ తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పర్యావరణ శాస్త్ర అధ్యాపకుడు సుధీర్ ఆరోపించారు. మే నెలలో 18మంది అధ్యాపకులను తొలగించినందుకు వారి తరపున పోరాడానని... ఆ కక్షతోనే తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు కళాశాలకు వస్తున్నప్పటికీ 4నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వెంటనే తనను విధుల్లోకి తీసుకుని జీతం బకాయిలు విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ఉప కులపతి నియామకం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వీసీ రామలింగరాజును వివరణ కోరగా... పని తక్కువగా ఉన్నందున కొంతమందిని తొలగించాలని మే నెలలో భావించామన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వంటి పెద్దల విజ్ఞప్తితో వారిని విధుల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. సుధీర్ పని చేసే విభాగంలో వర్క్ లోడ్ లేనందున విధులకు తీసుకోవడానికి ప్రిన్సిపల్ నిరాకరించారని తెలిపారు. బుధవారం నాటికి ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details