ఇసుక తవ్వకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి కొరత ఏర్పడింది. కరోనా మహమ్మారి తోడైన కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అనుబంధ రంగాల కార్మికులు సైతం ఇబ్బందులు పడాల్సివచ్చింది. గడచిన రెండు నెలలుగా ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నా.. వినియోగదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సుమారు 3 వేల కుటుంబాలు భవన నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో పనులు చేస్తుంటారు. సమీప జిల్లాల్లో ఇసుక కొరతతో నిర్మాణ పనులు జరగట్లేదు. ఫలితంగా.. కార్మికులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం వినతిపత్రం అందించారు. పర్యటన నిమిత్తం వచ్చిన పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు తమ కష్టాలను వివరించారు.