కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో రూ.3.75కోట్లతో నిర్మించనున్న ప్రాకార మండపం పనులను కలెక్టర్ మురళీధర్ రెడ్డి,కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు ప్రారంభించారు.ప్రాకార పనులు ప్రారంభించేందుకు వచ్చిన వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు శంకుస్థాపన చేశారు.ఏడు శనివారాలు నోము నోచుకునే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
వాడపల్లి ప్రాకార మండపం పనులకు శంకుస్థాపన - Construction of Prakara Mandapam works at Vadapalli Temple
తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు.
వాడపల్లి ఆలయంలో ప్రాకార మండపం పనులకు శంకుస్థాపన