తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లి వద్ద జాతీయ రహదారి 216పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కానిస్టేబుల్ మృతి చెందారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను... పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన 32 సంవత్సరాల ఆర్ఎన్ వర్మగా గుర్తించారు. ఆయన మంగళగిరి 9 బెటానియన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం ఏ సమయంలో ఎలా జరిగింది అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు.
కొమానపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి - తూర్పు గోదావరి రోడ్డు ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. అతని వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని పరీశీలిస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి