వైకాపా ప్రభుత్వం అవినీతి పాలనలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులు వారి సమస్యలు చెప్పుకునేందుకు కూడా ముఖ్యమంత్రి అవకాశం కల్పించడం లేదని విమర్శించారు.
'వైకాపా ప్రభుత్వం అవినీతి పాలనలో కూరుకుపోయింది' - తిరుపతి ప్రెస్ కబ్ లో సమావేశం
వైకాపా పాలనలో రాష్ట్రంలో అవినీతి పేట్రేగిపోయిందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ నేత చింతామోహన్