రాష్ట్రంలో వైకాపా, తెదేపా నాయకులు వాడుతున్న భాష.. అనాగరికంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (union ex minister, congress leader chinta mohan) అన్నారు. రాష్ట్రాన్ని పాలించడంలో.. ఈ రెండు ప్రభుత్వాలూ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్.. దీపావళిలోపు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఎన్నివేల కిలోమీటర్లు ఆక్రమించుకుందో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో విలువైన టీకాలు వేసినా.. ప్రచారం చేసుకోలేదని.. కోవిడ్ టీకాలు వేసి ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.