ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ.. పోలీసులు, ఉపాధ్యాయులపైకి రాళ్లు

Conflict between two factions
Conflict between two factions

By

Published : Oct 6, 2021, 11:50 AM IST

Updated : Oct 6, 2021, 12:59 PM IST

11:47 October 06

ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఘటన

పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ.. పోలీసులు, ఉపాధ్యాయులపైకి రాళ్లు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం పోలీసులు, ఉపాధ్యాయులపై ఓ వర్గం వాళ్లు రాళ్లు విసిరారు. ఈ ఘర్షణలో ఓ కానిస్టేబుల్, మరో మహిళా ఉద్యోగికి  గాయాలయ్యాయి.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని తరిమికొట్టారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.  

       గత నెల 22 మొదటగా గ్రామంలో విద్యాకమిటీ ఎన్నికలను అధికారులు చేపట్టారు. ఎన్నికల సమయంలో తెదేపా, వైకాపా మధ్య ఉద్రిక్తత నెలకొనటంతో అధికారులు నేటికి ఎన్నికలను వాయిదా వేశారు.

 ఇదీ చదవండి

పాఠశాల విద్యా కమిటీల ఎన్నికల్లో రభస.. పలుచోట్ల ఎన్నికలు వాయిదా

Last Updated : Oct 6, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details