ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ - పల్లంలో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువురు వర్గాల వ్యక్తులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.

conflict between tdp and ysrcp leaders at pallam in east godavri district
పల్లంలో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

By

Published : Jun 7, 2020, 4:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా... మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ గ్రామంలో నివసించే వారంతా మత్స్యకారులే. 6వ తేదీన సంవత్సరీకం కార్యక్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే.. ఘర్షణకు దారితీసాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలివానై.. సోడాసీసాలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వచ్చాయి. ఈ గొడవలలో తెదేపాకు చెందిన దండుప్రోలు దాసుకు తీవ్ర గాయాలవడంతో.. అతనిని అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ మాసంభాషా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details