ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆందోళన' - జగ్గంపేట నేర వార్తలు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వేరే శాఖలో నియమించాలని డిమాండ్ చేశారు.

'Concerned about job security' in Jaggampeta east godavari district
'ఉద్యోగ భద్రత కల్పించాలంటూ జగ్గంపేటలో ఆందోళన'

By

Published : Jun 10, 2020, 6:41 PM IST

ప్రభుత్వ మద్యం షాపు​లలో పని చేస్తున్న సూపర్​వైజర్లు, సేల్స్​మ్యాన్​లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆందోళన చేశారు. అనంతరం సీఐ రాంబాబు, స్థానిక ఎమ్మార్వో కృష్ణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. మద్యపాన నిషేధంలో భాగంగా 13% దుకాణాలు తగ్గించడంతో అందులో పనిచేస్తున్న వారు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి స్పందించి.. తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మద్యపాన నిషేధానికి తమ మద్దతు ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details