తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమకు నెలకు రూ. 6,450 మాత్రమే చెల్లిస్తున్నారని, దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన కార్మికుల మాదిరిగా తమ జీతాలు కూడా రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నామన్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు సేవలు అందించడానికి ప్రస్తుతం ఉన్న కార్మికులు సరిపోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - sanitation workers Concern at tuni news udpate
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న తమ రక్షణకు సరైన సామగ్రి కూడా ఇవ్వడం లేదని తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన వారు ఈమేరకు సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన