తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ భారతి మోసానికి పాల్పడిందని.. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 860 మంది నుంచి వసూళ్లు చేసిన డ్వాక్రా రుణం మొత్తం బ్యాంకులో జమ చేయలేదని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ధవళేశ్వరం పీఎస్‌లో బాధితులు, యూబీఐ అధికారులు ఫిర్యాదు చేశారు.
ధవళేశ్వరం, రాజవోలు పరిధిలో మొత్తం 80 గ్రూపులలో 860 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ భారతి.. వారి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి రూ.15 లక్షలు బ్యాంకులో జమ చేసింది. దీనిపై బ్యాంకులో భారతిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన భారతి.. యాసిడ్ తాగింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.