ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తాం' - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా జి.మామిడాడ గ్రామంలోని కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని జేసీ కీర్తి తెలిపారు. ఈ మేరకు స్థానిక మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్​రూమ్​ను పరిశీలించారు.

jc keerti talking about facilities for the people at east godavari district
కంట్రోల్‌రూమ్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న జేసీ కీర్తి

By

Published : May 31, 2020, 11:13 PM IST

Updated : Jun 1, 2020, 9:09 AM IST

కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్న జి.మామిడాడ వాసులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేసీ కీర్తి పేర్కొన్నారు. పెదపూడి మండలం జి.మామిడాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఆమె పరిశీలించారు. కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, నోడల్‌ అధికారిణి పుష్పమణి, కాకినాడ రూరల్‌ సీఐ మురళీకృష్ణ, ఎంపీడీవో విజయభాస్కర్‌, తహసీల్దారు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక చర్యలు

కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో జి.మామిడాడ గ్రామంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి, ప్రజలకు అన్ని వసతులు సమకూర్చుతున్నారు. శనివారం అగ్నిమాపక సిబ్బంది... గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామంలో శనివారం 237 మంది నుంచి నమూనాలు సేకరించామని పెద్దాడ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని 108 ద్వారా అమలాపురంలోని కిమ్స్‌, మరికొంత మందిని విశాఖపట్నానికి పంపించామన్నారు.

ఇదీ చదవండి:

ప్రధాన వార్తలు@11AM

Last Updated : Jun 1, 2020, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details