తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అనంత బాబు ప్రారంభించారు. రైతులు పండించిన పంటలు దళారుల పాలు కాకుండా వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలకు విక్రయించుకోవచ్చు అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వ్యవసాయ మార్కెట్ కమిటీలు పటిష్టం చేయడంతో పాటు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్న దొర, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.
రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనం ప్రారంభం - ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అనంత బాబు ప్రారంభించారు.

రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనం ప్రారంభం
ఇది చదవండి: కాన్వాస్‌పై కరోనా బొమ్మ... చిన్నారుల సృజన అదిరిందమ్మ..