తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంపై అంతా అప్రమత్తమయ్యారు. మంత్రి పినిపె విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేటలో పర్యటించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్థానికంగా ఉన్న అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఇబ్బందులను గుర్తించాలని కలెక్టర్ వెల్లడించారు. కరోనా లక్షణాలున్న వారిని వైద్య పరీక్షలు నిమిత్తం క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండండి... నిర్లక్ష్యం వీడండి - kottapeta Corona Positive Cases in news
కొత్తపేట నియోజకవర్గంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ రావటంపై.. జిల్లా యంత్రాంగాం అప్రమత్తమైంది. మంత్రి పినిపె విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రజలను కలిశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వల్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
కొత్తపేటలో పర్యటించిన కలెక్టర్