జిల్లా నుంచి మత్తు పదార్థాల వాడకాన్ని దూరం చేసేందుకు మాస్టర్ వాలంటీర్స్ కృషిచేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త భారత్ మాస్టర్ వాలంటరీ శిక్షణా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి నషాముక్త భారత్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం గురించి మాస్టర్ వాలంటీర్స్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని బయటపడేసేందుకు వాలంటీర్లు కృషిచేయాలన్నారు. ఈ పథకం జిల్లాలో సక్రమంగా అమలయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.