ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన.. బాధితులకు భరోసా - ముమ్మిడివరం నియోజకవర్గం తాజా వార్తలు

ముమ్మిడివరం నియోజకవర్గంలో ముంపునకు గురైన లంక గ్రామాలను కలెక్టర్​ సందర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

collector muralidhar visited mummidivaram constituency flooded areas
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి

By

Published : Aug 20, 2020, 11:24 PM IST

వరద ముంపునకు గురైన లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుంటామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించి వరద బాధితులను పరామర్శించారు.

ముందుగా కలెక్టర్ ఐ.పోలవరం మండలం మురమళ్ళ ఏటిగట్టు వద్ద వున్న పుష్కరఘాట్​ను, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని గ్రామాలను సందర్శించారు. వరద బాధితులకు అందుతున్న భోజన వసతి, వైద్య సహాయం తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details