తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిస్తున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పోలింగ్ కేంద్రానికి సిబ్బంది బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని అధికారులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు - కలెక్టర్ కార్తికేయ మిశ్రా
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రానికి పంపిస్తున్నారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లను పంపిస్తున్నారు.