పోలవరం ముంపు బాధితుల అందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టామని.. ఇప్పటికే 75 శాతం మందికి పునరావాసం కల్పించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి.. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కమిషనర్ ఆనంద్, ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీవో సేన నాయక్తో కలిసి దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-2 పునరావాస కాలనీని సందర్శించి..నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దేవిపట్నం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని...వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు.