ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anandaiah Medicine: ఆనందయ్య మందు తయారీకి మూలికల సేకరణ - ఆనందయ్య మందు తయారీకి మూలికలు సేకరణ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన పెచ్చెట్టి మురళీకృష్ణ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తయారీకి కావల్సిన మూలికలను సేకరిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇప్పటికే లారీ ముడి సరుకు సేకరించామని వీటిని సోమవారం నెల్లూరుకు తరలించనున్నట్లు తెలిపారు.

collection of herbs for the preparation
ఆనందయ్య మందు తయారీకి మూలికల సేకరణ

By

Published : Jun 13, 2021, 10:53 PM IST

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తయారీకి కావల్సిన మూలికలను తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన పెచ్చెట్టి మురళీకృష్ణ సేకరిస్తున్నారు. రాజోలు పరిసర ప్రాంతాల్లో ఈ మందు తయారీకి కావల్సిన మూలికలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని సేకరించి ఆనందయ్యకు అందజేయనున్నట్లు మురళీకృష్ణ పేర్కొన్నారు. సేవాధృక్పథంతో ఆనందయ్య ఉచితంగా మందు అందించి ఎందరో కరోనా రోగులను కాపాడుతున్నారని..అందులో భాగం కావాలనే ఉద్దేశంతో మూలికల సేకరణ చేస్తున్నామన్నారు.

వాలంటీర్ల ద్వారా ఇప్పటికే లారీ ముడి సరకు సేకరించామని వీటిని సోమవారం నెల్లూరుకు తరలించనున్నట్లు తెలిపారు. ఆనందయ్య ద్వారా మందు తీసికొచ్చి ఇప్పటివరకు సుమారు 500 రోగులకు పంపిణీ చేసినట్లు మురళీకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details