ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల పాదాల కొలతల సేకరణ

‘జగనన్న విద్యా కానుక’ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బూట్లు సరఫరా కోసం ఈ సారి విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో బూట్లు పంపిణీ చేసినప్పటికీ వీటి సైజు సరిగా లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బందిపడ్డారు.

collect students
collect students

By

Published : Jun 10, 2020, 3:03 PM IST

విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసేందుకు అధికారులు విద్యార్థుల పాదాల కొలతలు సేకరిస్తున్నారు. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బూట్లు సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 4300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల పాదాల కొలతల సేకరణ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. దీనితో పాటుగా విద్యార్థుల అదనపు సమాచారాన్ని సేకరించి జగనన్న అమ్మ ఒడి వెబ్​సైట్​లో వివరాలను నమోదు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details