ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేరు కాలువపై కూలిన వంతెన... లారీ బోల్తా

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట-పిఠాపురం రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. గ్రావెల్ లోడుతో లారీ వెళ్తుండగా బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఆ లారీ కాలువలో పడిపోయింది.

collapsed bridge over the Eleru Canal at samalkota
ఏలేరు కాలువపై కూలిన వంతెన.. లారీ బోల్తా

By

Published : Nov 13, 2020, 10:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం-సామర్లకోట రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న పురాతన వంతెన కూలిపోయింది. గ్రావెల్ లోడ్​తో లారీ వెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కూలింది. ఫలితంగా ఆ లారీ ఏలేరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సామర్లకోట-పిఠాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details