ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొబ్బరి రైతులకు.. తీపి కబురు - east godavari dst farmers news

కొబ్బరి రైతును ఆదుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు లాభం చేకూరేలా కొనుగోళ్లు జరుగుతాయని నాఫెడ్ కేంద్రాల జిల్లా సమన్వయ కర్త సుధాకర్ రావు వెల్లడించారు.

coconut market started in east godavari dst ambajipeta
coconut market started in east godavari dst ambajipeta

By

Published : May 27, 2020, 8:05 AM IST

కొబ్బరి ధరలు దారుణంగా పడిపోయిన కారణంగా... రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు నాఫెడ్‌ కేంద్రాల జిల్లా సమన్వయ కర్త యు.సుధాకరరావు వెల్లడించారు. నాఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మార్కెట్‌ యార్డులో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

మలి విడతలో రావులపాలెం, తాటిపాక, నగరం, ముమ్మిడివరం మార్కెట్‌ యార్డులో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని సుధాకర్ చెప్పారు. కొత్త కొబ్బరి క్వింటాకు రూ.9,960, బాల్‌ కోప్రా క్వింటాకు రూ. 10,300 మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details