ఆత్రేయపురంలో కోడి పందేల జోరు - east godavari cock fights
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వసంతవాడలో కోడిపందేలు జోరుగా సాగాయి. లక్షల రూపాయలు చేతులు మారాయి. అయితే బరుల చుట్టు పక్కనున్న పంటలు పాడైపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆత్రేయపురంలో కోడిపందేలు...చేతులు మారిన లక్షల రూపాయలు
ఆత్రేయపురంలో కోడి పందేలు...చేతులు మారిన లక్షల రూపాయలు
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడలో కోడిపందేలు నిర్వహించారు. పంటపొలాల్లో బరులు ఏర్పాటు చేయగా... పందేల్లో భారీ సంఖ్యలో బెట్టింగ్ రాయుళ్లు పాల్గొన్నారు. వీటిని చూసేందుకు చుట్టపక్కల నుంచి భారీగా జనం తరలివచ్చారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. ప్రజలు చుట్టు పక్కల ఉన్న పంటలను తొక్కడం వల్ల పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించకోకపోవటం ఆశ్చర్యంగా ఉందని వాపోయారు.