ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత సరిహద్దుల్లోకి  అక్రమంగా శ్రీలంక బోటు.. పట్టుకున్న కోస్ట్ గార్డ్ - srilanka boat news in east godavari dst

రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన శ్రీలంక బోటును కోస్ట్ గార్డ్ పట్టుకుంది. ఆరుగురిని అరెస్ట్ చేసి బోటును తూర్పుగోదావరి జిల్లా తీరానికి చేర్చనున్నారు. టూనా చేపల్ని వేటాడేందుకు వీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

coast guard handover srilanka boat in east godavari dst
coast guard handover srilanka boat in east godavari dst

By

Published : Jul 13, 2020, 12:57 PM IST

Updated : Jul 13, 2020, 1:55 PM IST

భారత జలాల్లోకి అక్రమంగా చొరబడిన శ్రీలంక బోటును కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. శ్రీలంకలోని ముత్తకు చెందిన బోటు జలాల్లోకి ప్రవేశించి టూనా చేపల్ని వేటాడుతోంది. సమాచారం అందుకున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోస్ట్ గార్డ్ విభాగం సిబ్బంది.. సముద్రంలో వెంబడించి శ్రీలంక బోటును పట్టుకున్నారు.

బోటులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిపై ఇండియన్ ఫిషింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శ్రీలంక బోటును కోస్ట్ గార్డ్ సిబ్బంది కాకినాడ తీరానికి తీసుకురానున్నారు.

Last Updated : Jul 13, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details