ఈ నెల 16న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్.. అధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
CM TOUR: పి. గన్నవరంలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు - సీఎం జగన్ గన్నవరం పర్యటన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించడంతో పాటు, జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
cm tour in east godavari distirct
పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోడలపై అందమైన బొమ్మలను గీశారు. భారీ వర్షం కురిసినా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా వాటర్ ఫ్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు.