చిన్నారి హేమకు చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ.. కళ్లకు క్యాన్సర్ సోకి కంటి చూపును కోల్పోయింది. ఆమె దీన స్థితిపై 'కనులు లేవని... కన్నీళ్లకేం తెలుసు' అనే శీర్షికన ఈనాడు కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి... వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు
రాష్ట్రంలో ఇలాంటి నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని...ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. వెంటనే చికిత్సలు అందించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు !