తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు.. సీఎంకు పూర్ణకుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్.. స్వామివారి నూతన రథాన్ని ప్రారంభించారు.
గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమైంది. అనంతరం.. రూ.95 లక్షలతో 41 అడుగుల ఎత్తైన రథాన్ని ప్రభుత్వం చేయించింది. ఇవాళ ఆ నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. మరోవైపు.. ఈనెల 28 వరకు స్వామివారికి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.