CM Jagan : వైసీపీ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీలో కోటాలు, కత్తిరింపులు లేవని సీఎం జగన్ అన్నారు. జనవరి నుంచి సామాజిక పింఛన్ మరో 250 రూపాయలు పెంచిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో సభ నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం వరకు హెలికాప్టర్లో చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడినుంచి రోడ్ షో ద్వారా ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పింఛనుదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామని అన్నారు.
కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నాం: సీఎం జగన్ - CM Jagan
CM Jagan : ఈ నెల నుంచి సామాజిక పింఛన్లు పెంచిన నేపథ్యంలో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో మంచి చేయని నాయకుడు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన ఆన్నారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు.
Etv Bharat
"గతంలో మాదిరి పింఛన్లకు ఎక్కడ కత్తిరింపులు లేవు. కోటాలు లేవు. తేడాను గమనించాలని అడుగుతున్నా. ఏనాడు మంచి చేయని నాయకులు నేడు విమర్శిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల యుద్ధం కాదు... వర్గాల యుద్ధం. ఒకవైపు పేదవాడు, మరో వైపు పెత్తందారీ వ్యవస్థ. జాగ్రత్తగా ఆలోచించాలని అడుగుతున్నా. పొరపాటు జరిగింది అంటే పేదవాడు నాశనమైపోతాడు." -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇవీ చదవండి: