CM Jagan aerial survey : ఇవాళ మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌లో ఆయన తూర్పు గోదావరి జిల్లా సహా పరివాహక ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సీఎం ఆదేశించారు.
నేడు గోదావరి వరద ప్రాంతాల్లో.. సీఎం జగన్ ఏరియల్ సర్వే
CM Jagan aerial survey: నేడు గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్‌లోని అన్ని రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు విడుదల ఆవుతున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :