తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో క్లాక్ టవర్ నిర్మాణాన్ని గురువారం అర్ధరాత్రి అధికారులు కూల్చివేశారు. తెదేపా హయాంలో బంగారమ్మ రావిచెట్టి కూడలి వద్ద 15 లక్షల రూపాయలతో ఈ టవర్ను నిర్మిస్తున్నారు. అయితే ఆరు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ప్రజలు ఫిర్యాదులు చేయడం వల్లే టవర్ కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు. కూల్చివేతను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదికను అర్ధరాత్రి వేళ కూల్చివేస్తే అదే తరహాలో స్థానిక ఎమ్మెల్యే దొరబాబు అర్ధరాత్రి క్లాక్‌టవర్‌ను కూల్చివేశారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లాక్ టవర్ కూల్చివేతపై తెదేపానేతల ఆగ్రహం - tdp leaders dharna for clock tower in east godavari
తూర్పుగోదావర జిల్లా పిఠాపురం క్లాక్ టవర్ నిర్మాణాన్ని అధికారులు అర్ధరాత్రి కూల్చివేశారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.
క్లాక్ టవర్ కూల్చివేతపై తెదేపానేతల ఆగ్రహం
TAGGED:
latest news of east godavari