తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని ప్రత్తిపాడు, కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నుంచి ఒక సామాజిక వర్గంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు నెలకొన్నాయి.
కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ సూచన మేరకు కాలనీలో అంబేడ్కర్ విగ్రహానికి మాస్క్ కట్టడంతో మళ్ళీ వివాదం చెలరేగింది. అది కాస్తా ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఒక వర్గం వారు బయట నుంచి వ్యక్తులను తీసుకుని వచ్చి మరో వర్గంపై దాడికి పాల్పడ్డారని అరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలకు సంబంధించిన 20 మందిపై కేసులు నమోదు చేశారు.