ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామర్లకోట వైస్​ చైర్మన్ ఎన్నికలో వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ - Samarlakota vice chairman election news

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట వైస్​ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం ఎదుట వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.

Clash among ysrcp members
వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ

By

Published : Mar 18, 2021, 5:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్​ వైస్ చైర్మన్​ ఎన్నిక విషయంలో వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. వైస్ చైర్మన్​గా​ ఎన్నికైన అభ్యర్థి సోదరుడు, కౌన్సిలర్​ నేతల హరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సామర్లకోట మున్సిపల్ చైర్​పర్సన్​గా గంగిరెడ్డి అరుణ, వైస్​ చైర్మన్​గా ఉబా జాన్ మోజేశ్​ ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారణం అనంతరం రెండో వైస్​ చైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైస్​ చైర్మన్ ఎన్నికలో వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ

హరిబాబు, కృష్ణ.. ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో సత్యనారాయణతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం బయటకు వెళ్లిన తర్వాత నేతల హరిబాబు తనకు వైస్ చైర్మన్​ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్​ జాన్ మోజెస్ వర్గం సభ్యులు, నేతల హరిబాబుతో ఘర్షణకు దిగారు. అధికార పక్ష సభ్యులే బహిరంగంగా గొడవపడటం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

ABOUT THE AUTHOR

...view details