సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పొదలాడకు చెందిన కవి, రచయిత ఎమ్మెస్ సూర్యనారాయణను అభినందిస్తూ లేఖ రాశారు. కవి సూర్యనారాయణ రచించిన కొన్నింటిని జస్టిస్ ఎన్వీ రమణకు పంపగా వాటికి అనందం వ్యక్తం చేస్తూ..అభినందనలు తెలుపుతూ జస్టిస్ ఎన్వీ రమణ తిరిగి లేఖ రాశారు.
కవి సూర్యనారాయణ రచించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి జీవిత చరిత్ర హరికథ బిక్షువు, నరసాపురం తొలి ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సూర్యనారాయణ రాజు జీవిత చరిత్ర సత్యపథం, రాజోలు గాంధీ హౌస్, శబ్దభేది పుస్తకాలను ఎన్వీ రమణకు పంపించారు. వాటికి ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ...తిరిగి లేఖ రాయడం చాలా అనందం కలిగించిందని కవి సూర్యనారాయణ అన్నారు.