దేశంలో కార్మిక చట్టాలను మార్పు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ జిల్లా నాయకురాలు మట్ల వాణిశ్రీ అన్నారు. దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.
లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్పు చేసిందన్నారు. 12 గంటల పని విధానాన్ని అమలు చేయడంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. 8 గంటల విధానాన్ని అవలంబించాలని డిమాండ్ చేశారు.