వలస కూలీలకు రైతు సంఘం సాయం - సీఐటీయూ రైతు సంఘం ఆహార పంపిణీ వార్తలు
సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం జాతీయ రహదారిపై అంబలి పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నారు. దీంతో వారికి సహాయం చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ఈ రహదారిపై కాలినడకన, సైకిళ్లపై, వివిధ వాహనాలపై తమ ప్రాంతాలకు తరలి వెళ్తున్న వారు ఆహారం, తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దారిపొడవునా అనేక సేవాసంస్థలు వీరికి సహరిస్తూ సహాయం చేస్తున్నాయి. సీఐటీయూ రైతు సంఘం సభ్యులు కూడా ఇదే విధంగా వలస కూలీలకు వారం రోజుల పాటు ఆహారం అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగా ఈ రోజు వలస కూలీలకు బిర్యానీ పొట్లాలు, అంబలి, రొట్టెలు, మజ్జిగ మంచినీరు అందించారు.