రాష్ట్రంలో కరోనా సందర్భంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను నిలిపివేయాడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్, డీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భవననిర్మాణ రంగంపై ఆధారపడి 5 లక్షల మంది జీవనం సాగిస్తున్నారని. వీరు సంక్షేమం నిమిత్తం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును 2009 లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బోర్డు ద్వారా కార్మికులు పొందే పెళ్లి కానుకతో సహా శాశ్వత అంగ వైకల్యం, ప్రమాద మరణం, సహజ మరణం పథకాలను చంద్రన్న బీమాలో గత ప్రభుత్వం కలపడం జరిగిందన్నారు.
"కరోనా సంక్షోభం పేరుతో సంక్షేమ పథకాలను హోల్డ్‌లో పెట్టడం సరికాదు" - corona effect on welfare schemes
వైఎస్ఆర్ పెళ్లి కానుకతో సహ పలు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద, డీఆర్డీఏ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. లాక్డౌన్ కారణంగా పలు పథకాలను హోల్డ్‌లో పెట్టడం సరికాదని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటేనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
"కరోనా సంక్షోభం పేరుతో సంక్షేమ పథకాలను హోల్డ్‌లో పెట్టడం సరికాదు"