ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రచార ఆర్భాటం తప్ప.. రైతులను ఆదుకోవడం లేదు' - chinarajappa on ysrcp government

రాష్ట్రంలో రైతులు సాగునీరు అందక, విత్తనాలు ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప... రైతులకు ఏమీ చేయటం లేదని ఆయన ఆరోపించారు.

cinarajappa on ysrcp government
వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప

By

Published : Jul 9, 2020, 4:13 PM IST

వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంలో తప్ప రైతులను ఆదుకోవడంలో విఫలమైందని తెదేపా విమర్శించింది. వైఎస్‌ పేరు చెప్పి రైతులకు ముఖ్యమంత్రి జగన్‌ తానేదో చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని... సాగునీరు అందక, విత్తనాలు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోనే రబీ ధాన్యం బకాయిలు రూ.400 కోట్లు ఉన్నాయని, సాగుదారులకు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చినరాజప్ప అన్నారు. రైతు బకాయిలు చెల్లించాలని చినరాజప్ప డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: గదిలో ఇల్లాలు.. పక్కగదిలో ప్రియురాలు; హనీమూన్ కు తీసుకెళ్లిన ఘరానామొగుడు

ABOUT THE AUTHOR

...view details