ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యపరికరాల కొనుగోలుపై కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు - cid conducting raids over medical equipment purchases in government hospitals

వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణపై నమోదైన కేసును సీఐడీ అధికారులు విచారణ చేపట్టడానికి సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

సీఐడీ తనిఖీలు
సీఐడీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు

By

Published : Apr 12, 2021, 3:49 PM IST

వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణకు సంబంధించి నమోదైన కేసుపై సీఐడీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల, వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలోని రికార్డులు, పరికరాలను పరిశీలించారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. వివిధ కొనుగోళ్లపై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గడచిన మూడు రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల తనిఖీలు పూర్తైన తర్వాత వాస్తవాలపై నివేదిక తయారు చేసి దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details