ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CID: జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లకు.. మే 12 వరకు రిమాండ్‌ - ఏపీ న్యూస్

Jagajjanani Chit Funds Directors: రాజమహేంద్రవరం నగర టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. సుమారు 17 గంటల విచారణ అనంతరం రాత్రి 10 గంటలకు వారి అరెస్టును అధికారులు ధ్రువీకరించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ జిల్లా జడ్జి అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

CID ARREST
సీఐడీ అరెస్ట్

By

Published : May 1, 2023, 6:57 AM IST

Updated : May 1, 2023, 9:53 AM IST

CID: జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లకు.. మే 12 వరకు రిమాండ్‌

Jagajjanani Chit Funds Directors: జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఆ సంస్థ డైరెక్టర్లు.. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమేరకు సీఐడీ కేంద్ర కార్యాలయం ధ్రువీకరించింది. కాకినాడకు చెందిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కొర్ని వరప్రసాద్‌ ఏప్రిల్‌ 29న సీఐడీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై అధికారులు 420, 409, 120, 477, రెడ్‌విత్‌ సెక్షన్‌ 34 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సంస్థ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి కుమార్తె వెంకట జోత్స్నతో పాటు జగజ్జననీ సంస్థను నిందితులుగా చేర్చారు. ఆదివారం సుమారు 17 గంటల విచారణ జరిగిన తర్వాత రాత్రి 10 గంటలకు వారి ఇద్దరి అరెస్టును సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. వారిని అరెస్టు చేశారా.. లేదా అన్న అంశంపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. స్థానిక సీఐడీ కార్యాలయం వద్ద రోజంతా ఉద్రిక్తత నెలకొంది.

టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు తరలివచ్చారు. చివరకు రాత్రి పదిన్నరకు వారి ఇద్దరి అరెస్టును నిర్ధారించిన సీఐడీ పోలీసులు.. వారిని రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌కు తరలించి, అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. సుమారు రెండు గంటలు వాదనల అనంతరం ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాత్రి ఒంటి గంట సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు.

ఆ ఓటింగ్‌లో తాను పాల్గొనడం, టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష పెంచుకుందని తెలిపారు. తన భర్త, మామకు భోజనం అందించేందుకు ఆదివారం మధ్యాహ్నం సీఐడీ కార్యాలయానికి వెళ్లిన ఆమె అక్కడ మీడియా ఎదుట తన ఆవేదనను తెలియజేశారు. ఆదివారం ‘ఉదయం 5 గంటలకు ఐదుగురు సీఐడీ అధికారులు వచ్చి తన భర్త, మామను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగినా చెప్పలేదన్నారు. ఇంటి బయట సుమారు 50 మంది పోలీసులను మోహరించారని చెప్పారు.

రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమైన క్రమంలో..దాన్ని అడ్డుకునేందుకు ఈ తరహా కుట్రలు పన్నారని ఆరోపించారు. వీటిని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని వివరించారు. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం శ్రేణులు ఖండించాయి. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

"ఇది కక్ష సాధింపు అనే అనుకోవాలి. 30 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. ఎప్పుడూ కనిపించనివి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి. చాలా ప్రభుత్వాలు మారాయి. ఏదైనా లోటుపాట్లు ఉంటే అప్పటి నుంచి బయటకు వచ్చేవి. ఫిర్యాదులు చేసేవారు. కానీ ఇవేమీ లేకుండా.. ఈ నాలుగేళ్లుగా చూస్తున్నాం ఎవరైతే గొంతు ఎత్తి ప్రజల పక్షాన పోరాడుతున్నారో వారిని ఎవరినీ వదలడం లేదు. ఇప్పుడు మా కుటుంబం మీద పడ్డారు". - ఆదిరెడ్డి భవానీ, టీడీపీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details