రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ కచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు అమలు చేయడంలో.. పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో... తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సీఐ రాంబాబు సైకిల్‌పై సంచరిస్తూ.. పట్టణంలో కరోనా విధులు నిర్వహించారు.
ప్రధాన రహదారిపై దుకాణాలను మూసివేయించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయట తిరగకూడదని అవగాహన కల్పించారు. ఆయన పనితీరుపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ పై విధులకు హాజరవుతున్న ఆయన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.