తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని ఓ ఇంట్లో దుండగులు చోరీ చేశారు. కిరాణా దుకాణంలో పనిచేస్తున్న దాసరి రామలక్ష్మి తిరుపతి వెళ్లి ఈనెల 12వ తేదీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 2.09 లక్షల రూపాయల విలువైన వస్తువులు పోయాయని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'తిరుపతి వెళ్లోచ్చేసరికి ఇళ్లు చోరీ' - chory in annavaram
అన్నవరంలోని ఓ ఇంటిలో దుండగులు చోరికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'తిరుపతి వెళ్లోచ్చేసరికి ఇళ్లు చోరీ'