తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి పంచాయతీ సుబ్బరాయపురం వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణం వద్ద సెక్యూరిటీ గార్డును బెదిరించి చోరీకి పాల్పడ్డారు. దుకాణం సిబ్బంది సుమారు రూ. 7.52 లక్షల మద్యం అమ్మకం సొమ్మును ఐరన్ సేఫ్ లాకర్ లో ఉంచగా ఈ నగదు తో పాటు రూ. 3 వేలు విలువైన మద్యం కూడా దొంగిలించినట్లు సమాచారం. సేల్స్ మెన్ ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుబ్బరాయపురం ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ.. - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి పంచాయతీ సుబ్బరాయపురం వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. 7.52 లక్షల నగదు, రూ.3వేలు విలువైన మద్యం అపహరణకు గురైనట్లు దుకాణాదారులు తెలిపారు.
chori at govt wine shop in east godavari dst thondangi mandal