వైకాపా ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. రుణమాఫీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా రూ. 400 కోట్ల బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేస్తూ... మైండ్ గేమ్ ఆడుతోందన్నారు.
వైకాపా ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు: చినరాజప్ప - tdp on ysrcp government
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప అన్నారు. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంటే.. ప్రభుత్వం రుణమాఫీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వం పై చినరాజప్ప