25 లక్షల కాపు మహిళల్లో ఒక్క శాతానికే కాపు నేస్తం లబ్ధి చేకూర్చడం మోసమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 5 శాతం కాపు, బలిజ, తెలగ, ఒంటరి రిజర్వేషన్ల రద్దు కాపు ద్రోహం కాదా అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ పరిధిలో వైకాపా ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు ఇచ్చింది కేవలం రూ. 354 కోట్లు మాత్రమేనన్నారు.
రాయలసీమలో ప్రధాన కులంగా ఉన్న బలిజలకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రూ. 4,700 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా వైకాపా చేసే ప్రచారం అంకెల గారడీ మాత్రమేనని స్పష్టం చేశారు.