రాజధాని రైతులంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని మాజీమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆరోపించారు. రైతుల ఆందోళనకు మద్దతిస్తే తెదేపా నేతలను అరెస్టు చేస్తారా అని నిలదీశారు. రైతుల చేస్తోన్న ఆందోళనతో సర్కారుకు భయం పట్టుకుందన్నారు. రైతులు, తెదేపా నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. అరెస్టులతో అన్నదాతలను వైకాపా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాజధానిని అమరావతిలో కొనసాగించే వరకు రైతుల ఉద్యమానికి మద్దతిస్తామని చినరాజప్ప స్పష్టం చేశారు.
'రైతులను ఆందోళనకు గురి చేసేందుకే అక్రమ అరెస్టులు' - Ap capital issue news
రాజధాని రైతులపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చేస్తోన్న రైతులు, తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టులతో రైతులను.. ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.
చినరాజప్ప